బాలుడి ప్రాణం తీసిన టైరు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 26 July 2024 7:17 AM ISTబాలుడి ప్రాణం తీసిన టైరు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఒక పెద్ద టైర్లు దొర్లుకుంటూ వచ్చి బాలుడిపై పడింది. దాంతో.. అతను ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడకు చెందిన సందీప్‌రెడ్డి ఆదివారం రాత్రి ముత్తంగి దాబాలో భోజనం చేసేందుకు కారులో కుటుంబ సభ్యులతో బయల్దేరారు. సుల్తాన్‌పూర్ వద్ద ఔటర్ రింగురోడ్డు ఎక్కిన కాసేపటికే ఆరేళ్ల కుమారుడు మోక్షిత్‌రెడ్డి మూత్ర విసర్జన అంటూ తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో.. వారు కారు రోడ్డు పక్కకునిలిపారు. బాలుడు రోడ్డు పక్కకు మూత్ర విసర్జన చేస్తుండగా గుర్తు తెలియని వాహనం టైరు వేగంగా దొర్లుకుంటూ వచ్చి బాలుడిని ఢీకొట్టింది. దాంతో.. పిల్లాడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని ముత్తంగిలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నగంరలో మరో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం సాయంత్రం బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్‌పై ఏదైనా వాహం టైరు ఊడిపోయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.