Sangareddy: ఇంజినీరింగ్‌ కాలేజ్‌ క్యాంటీన్‌ చట్నీలో ఎలుక.. వైరల్ వీడియో

సంగారెడ్డి జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌ దగ్గర ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో కలకలం రేగింది.

By Srikanth Gundamalla  Published on  9 July 2024 11:45 AM IST
sangareddy, engineering, hostel chutney, rat ,

 Sangareddy: ఇంజినీరింగ్‌ కాలేజ్‌ క్యాంటీన్‌ చట్నీలో ఎలుక.. వైరల్ వీడియో

సంగారెడ్డి జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌ దగ్గర ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో కలకలం రేగింది. కాలేజ్‌ క్యాంటీన్‌లో ఓ చట్నీ గిన్నెలో ఎలుక తిరుగుతూ కనిపించింది. దాంతో.. ఇది గమనించిన విద్యార్థులు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో క్యాంటిన్‌ సిబ్బంది నిర్వాకంపై మండిపడుతూ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. బాయ్స్‌ హాస్టల్‌ క్యాంటీన్‌లో ఈ ఘటన జరిగింది. చట్నీ గిన్నెపై మూతపెట్టకపోవడం వల్ల ఎలుక అందులో పడిపోయి ఉంటుందని అంటున్నారు. అయితే.. కొందరు ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి విద్యార్థుల నుంచి ఫిర్యాదులను అందుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం.. ప్రజాప్రతినిధులు కూడా కలుగుజేసుకుంటుండటంతో ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుకపడలేదని చెప్పారు. శుభ్రం చేసేందుకు ఉచింన పాత్రలో ఎలుక కనిపించిందని వెల్లడించారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తిప్పి కొట్టారు ప్రిన్సిపాల్ నరసింహ. కాగా.. దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Next Story