దసరాకు ఊళ్లకు వెళ్లేవారికి TGSRTC గుడ్‌న్యూస్
దసరా పండుగ రాబోతుంది.
By Srikanth Gundamalla Published on 30 Sept 2024 4:40 PM ISTదసరాకు ఊళ్లకు వెళ్లేవారికి TGSRTC గుడ్‌న్యూస్
దసరా పండుగ రాబోతుంది. పది రోజుల్లో రాబోతున్న పండగ వేళ స్కూళ్లకు దసరా సెలవులు కూడా ప్రకటించేశారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ప్రభుత్వం స్కూళ్లకు సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలకు వరుస సెలవులు రావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సొంత గ్రామాల్లో పండుగకు వెళ్తుంటారు. రైళ్లు, బస్సు, సొంత వాహనాల్లో స్వగ్రామాలకు ప్రజలు వెళ్తుంటారు. అయితే.. అనేక మంది రోడ్డు ప్రయాణంలోనే వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఊర్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.
ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. దసరాకు టీజీఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ శివారు నుంచి దసరాకు స్పెషల్ బస్ సర్వీసులు నడుస్తాయన్నారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులను సిద్ధం చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో ఉచుంతామన్నారు. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు .ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను నడుపుతామని సజ్జనార్ చెప్పారు. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.