నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం.. తొలి సంతకం ఆమె ఫైల్‌పైనే..!

తెలంగాణలో ఇవాళే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది.

By Srikanth Gundamalla  Published on  7 Dec 2023 1:14 AM GMT
Revanth Reddy,  sworn, telangana cm,

 నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం.. తొలి సంతకం ఆమె ఫైల్‌పైనే..!

తెలంగాణలో ఇవాళే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎల్‌బీ స్టేడియంలో మద్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డి, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిచంనున్నారు. అయితే.. ఇప్పటి వరకు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారనే విషయం అధికారికంగా ప్రకటించకపోయినా.. 8 మంది వరకు మంత్రులను ప్రమాణస్వీకారం చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల చట్టానికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. అలాగే రజని అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై సంతకం చేయనున్నారు.

అక్టోబర్ 17న గాంధీ భవన్‌లో రేవంత్‌రెడ్డిని వికలాంగురాలు రజనీ కలిశారు. అయితే.. ఆమె ఎంఏ చదివినా ఉద్యోగం రాలేదనీ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. ప్రయివేట్‌ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదంటూ రేవంత్‌రెడ్డికి చెప్పి వాపోయింది. అప్పుడే ఆమెకు రేవంత్‌రెడ్డి ఇలా చెప్పారు.. త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని.. ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలను గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆ దివ్యాంగురాలికి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని తొలుతగా అమలు చేయబోతున్నారు. ఇవాళ ఎల్‌బీ స్టేడియంలో జరిగి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని రజనీకి కూడా ఆహ్వానం పంపింది కాంగ్రెస్. దాంతో.. రజనీ ఉద్యోగ నియామక ఫైల్‌పై రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో తొలి సంతకం చేయనున్నారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిఉన్నాయి. అయినా.. మంత్రివర్గ కూర్పుపై పూర్తిగా క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం పాక్షికంగానే ప్రమాణస్వీకారం చేస్తారా? లేకా పూర్తిస్థాయిలోనా అనేది తెలియాలి. మరోవైపు సీఎంతో పాటు 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయాలని.. తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని ప్రతిపాదన ఉందని కాంగ్రెస్‌లో వినిపిస్తోంది.

Next Story