ఎన్నికల్లో పోచారం గెలుపు.. రికార్డు బ్రేక్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 2:46 PM ISTఎన్నికల్లో పోచారం గెలుపు.. రికార్డు బ్రేక్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ 20కి పైగా స్థానాల్లో విజయాన్ని అందుకోగా.. మరో 40 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. స్పష్టమైన మెజార్టీతో ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. బీఆర్ఎస్‌లో పలువురు మంత్రులకు షాక్ తప్పలేదు. కానీ.. స్పీకర్‌గా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం గెలుపొందారు. ఈ నేపథ్యంలో రికార్డును తిరగ రాశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. తద్వారా రికార్డును తిరగరాశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై విజయం అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. కానీ ఆ సెంటిమెంట్‌ను పోచారం బ్రేక్ చేశారు. స్పీకర్‌గా పనిచేసిన తర్వాత కూడా విజయాన్ని అందుకున్నారు. స్పీకర్‌గా పనిచేస్తే ఎన్నికల్లో గెలవరని ఎన్నో ఏల్లుగా ఉన్న ఆనవాయితీని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బద్దలుకొట్టారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి సిరికొండ మధుసూదనాచారి గెలిచారు. ఆ తర్వాత 2014 నుంచి 2018 వరకు ఆయన తెలంగాణ శాసన సభ తొలిస్పీకర్‌గా పనిచేశారు. ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. కానీ విజయాన్ని అందుకోలేకపోయారు. ఈయన ఒక్కరే కాదు.. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు. తాజాగా స్పీకర్‌గా ఉన్న పోచారం ఈసారి గెలిచి రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.