డీఎస్పీగా బాక్సర్ నిఖత్ జరీన్‌ నియామకం

బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా నియమితులయ్యారు.

By Srikanth Gundamalla  Published on  18 Sept 2024 8:15 PM IST
డీఎస్పీగా బాక్సర్ నిఖత్ జరీన్‌ నియామకం

భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్‌ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం ఉద్యోగాన్ని కేటాయించింది. ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా నియమితులయ్యారు. నియామక పత్రాన్ని అందుకున్నారు నిఖత్ జరీన్. నిఖత్ జరీన్‌కు మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ ఉంటుంది. కాగా.. నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని గ‌త నెల 1న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెక్ష‌న్ 4లోని తెలంగాణ రెగ్యులేష‌న్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు స‌వ‌ర‌ణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది. సెప్టెంబర్‌ 18న డీజీపీ జితేందర్‌ రెడ్డిని కలిసిన నిఖత్‌ జరీన్‌కు .. ఆయన నియామక పత్రాన్ని అందించారు.

ప్రపంచ మహిళా బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ కు జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. నిఖత్‌తో పాటు.. క్రీడాకారులు ఈషా సింగ్, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ లకు కూడా 600 గజాల ఇంటి స్థలం కేటాయించారు.

ఇక నిజామాబాదు కు చెందిన నిఖ‌త్ జ‌రీన్‌ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. దాంతో ఒలంపిక్స్ 2024 లో ఆమెపై అభిమానులు మెడల్ సాధిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ సెమీ ఫైనల్స్ కూడా చేరలేకపోయింది. నిఖ‌త్ జ‌రీన్‌ చైనీస్ సీడెడ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. కానీ.. నిఖ‌త్ జ‌రీన్‌ సాధించిన విజయాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఈ డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది.



Next Story