మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై NDSA సంచలన నివేదిక

మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిన ఘటనపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  3 Nov 2023 2:04 PM IST
NDSA, shocking report,  medigadda barrage,

మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై NDSA సంచలన నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ బ్రిడ్జి కొద్ది రోజుల క్రితం కుంగిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో ఈ అంశంపై రచ్చ కొనసాగుతోంది. పైగా కేంద్ర బృందం కూడా ఈ బ్రిడ్జిపై పరిశీలన చేసింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిన ఘటనపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్లాలిటీ కంట్రోల్, ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిందని అథారిటీ నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి , ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని అథారిటీ పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది.

అయితే.. విచారణలో భాగంగా తమకు అరకొర సమాచారమే అందింది అని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ పేర్కొంది. అడిగిన 20 అంశాల్లో 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని పేర్కొంది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే కుంగిందని అథారిటీ నివేదికలో పేర్కొంది. ఇన్‌స్ట్రుమెంటనేషన్, వర్షాకాలం ముందు, తర్వాత ఇన్‌ఫెక్షన్‌ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్ట్‌లు, థర్డ్‌ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం సహా తదితర అంశాలపై సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. సమాచారం దాచిపెట్టినట్లు అయ్యితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని NDSA నివేదికలో పేర్కొంది.

పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు:

* బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు

* మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి

* అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది

* డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది

* బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది

* సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు

*ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం

*బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది

*కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది

*రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది

*అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది

కాగా.. మేడిగడ్డ బ్యారేజ్‌ 2019లో నిర్మించారు. 2023 అక్టోబర్‌ 21వ తేదీన బ్యారేజ్‌ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన టీమ్‌ తాజాగా నివేదినకను విడుదల చేసింది.

Next Story