మట్టి మిద్దె కూలి నలుగురు మృతి.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
నాగర్‌కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 July 2024 2:06 AM GMTనాగర్‌కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నాగర్‌కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపుతోంది.
ఈ విషాద ఘటన నాగర్‌కర్నూలు మండలంలోని వనపట్ల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకరాం.. గొడుగు భాస్కర్, పద్మ (28) భార్యాభర్తులు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. పప్పి ఆరేల్లు, వసంతకు ఏడేళ్ల వయసు. కుమారుడు విక్కీ వయసు మూడు నెలలు. భాస్కర్ ఆటో నడుపుతూ జీవినం సాగిస్తున్నాడు. రోజులాగే పనికి వెళ్లికి రాత్రి ఇంటి వచ్చాడు. రాత్రి భోజనం చేసి అంతా పడుకున్నారు. అయితే.. ఆదివారం రాత్రి స్థానికంగా భారీ వర్షం కురిసింది. మట్టి మిద్దె పాతది కావడం.. మరో వైపు భారీ వర్షం కురవడంతో పూర్తిగా తడిసి ఒక్కసారిగా మట్టి మిద్దె కూలిపోయింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కూతుర్లు, కుమారుడు విక్కీ అక్కడికి అక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలను సేకరిస్తున్నారు.