డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 12:05 PM ISTడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. గురువారం రాత్రి భట్టి విక్రమార్కను కలిశారు చిరంజీవి. ఆయన తన సతీమణి సురేఖతో కలిసి ప్రజాభవన్‌కు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని.. చిరంజీవి శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత చిరంజీవి దంపతులను కూడా భట్టి శాలువాతో సత్కరించారు. చిరంజీవితో సమావేశం అయిన తర్వాత దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను డిప్యూటీ సీఎం భట్టి సోషల్ మీడియా దవ్ఆరా షేర్ చేశారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్ఆపటు చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక్కొక్క ప్రజా నేతలను కలుస్తున్నారు.
ఇంతకు ముందు చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి నాగార్జున, బాలకృష్ణ వంటి వారు కూడా సీఎం రేవంత్‌రెడ్డిని మార్యదపూర్వకంగా కలిశారు. వరుసగా సెలబ్రిటీలు ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. గత ప్రభుత్వంతో ఉన్నట్లుగానే మంచి సంబంధాన్ని కొనసాగించేలా టాలీవుడ్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ప్రజాభవన్ లో కలిసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారి దంపతులు@KChiruTweets #BhattiVikramarkaMallu #Chiranjeevi pic.twitter.com/m11XTpPBsX
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 4, 2024