మేడారం హుండీ లెక్కింపు, అంబేద్కర్ ఫొటోలతో ఫేక్ కరెన్సీ (వీడియో)
మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా ముగిసింది.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 10:45 AM GMTమేడారం హుండీ లెక్కింపు, అంబేద్కర్ ఫొటోలతో ఫేక్ కరెన్సీ (వీడియో)
మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా ముగిసింది. అమ్మవార్లను కోటికి పైగా మంది భక్తులు దర్శించుకున్నారు. జాతర ముగిసిన సందర్భంగా అధికారులు మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీలను లెక్కింపు ప్రారంభించారు. ఇందులో భాగంగానే అధికారులకు ఫేక్ కరెన్సీ కనిపించింది. అంబేద్కర్ ఫొటోలతో ఉన్న కొన్ని కరెన్సీ నోట్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగు రోజుల పాటు వైభవంగా సాగిన సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. కోటిన్నరకు పైగా మంది భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే.. జాతర ముగిసిన సందర్భంగా హుండీల లెక్కింపు కొనసాగిస్తున్నారు. మొత్తం 518 హుండీలు ఏర్పాటు చేయగా..వాటన్నింటినీ లెక్కిస్తున్నారు. హన్మకొండలోని టీటీడీ కాళ్యాణమండపంలో అన్ని హుండీలను ఒకే చోట చేర్చి లెక్కిస్తున్నారు. దాదాపు ఓ హుండీల లెక్కింపు కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగనుంది. అయితే.. తాజాగా హుండీల లెక్కింపు సమయంలో బయటపడ్డ నోట్లను చూసిన అధికారులు అవాక్కయ్యారు. కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫొటోకు బదులుగా అంబేద్కర్ ఫొటో ఉంది. అలా కొన్ని ఫేక్ కరెన్సీ నోట్లు దర్శనం ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీల్లో మొదట ఓపెన్ చేసిన వాటిల్లోనే ఈ ఫేక్ కరెన్సీ లభ్యం అయ్యింది. బీఆర్.అంబేద్కర్ ఫొటోతో ముద్రించిన నకిలీ వంద రూపాయల నోట్లు బయటపడ్డాయి. కాగా.. గత కొద్దికాలం ముందు అంబేద్కర్ బొమ్ను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ తరుణంలో ప్రజల దృష్టికి ఈ విషయం వెళ్లాలని హుండీల్లో ఈ నోట్లను వేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.
ఘనంగా ముగిసిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 29, 2024
మేడారం హుండీ లెక్కింపు, అంబేద్కర్ ఫొటోలతో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లు లభ్యం pic.twitter.com/BxKHBTyJ01