Rajendranagar: బిర్యానీలో బల్లి కలకలం, 8 మందికి అస్వస్థత

లంచ్‌లో అయినా.. డిన్నర్‌లో అయినా.. ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నా ఆహారంలో కామన్‌గా ఉండే డిష్ బిర్యానీ.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 1:07 AM GMT
Lizard,  biryani, 8 people, sick, rajendranagar ,

Rajendranagar: బిర్యానీలో బల్లి కలకలం, 8 మందికి అస్వస్థత

లంచ్‌లో అయినా.. డిన్నర్‌లో అయినా.. ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నా ఆహారంలో కామన్‌గా ఉండే డిష్ బిర్యానీ. ఇక హైదరాబాద్‌లో అయితే గల్లీకో బిర్యానీ సెంటర్ ఉంటుంది. పెద్ద రెస్టారెంట్లు.. చిన్న చిన్న హోటళ్లు ఏ ధరకు ఆ టేస్టు ఉంటుంది. ఇక భోజనప్రియులు తమకు నచ్చిన చోటుకి వెళ్లి బిర్యానీని లాగిస్తుంటారు. అయితే.. కొన్నికొన్ని సార్లు హోటల్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కస్టమర్లు ఇబ్బందులు పడుతారు. ఆహారంలో బొద్దింకలు.. బల్లులు ఇలాంటివి వస్తుంటాయి. అవి తెలియకకుండా తినే వారు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

రాజేంద్రనగర్ డెయిరీ ఫామ్‌ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు 8 మంది యువకులు. మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేసి తిన్నారు. ఆకలిగా ఉన్న వారంతా బిర్యానీ ఆర్డర్‌ టేబుల్‌పైకి రాగానే ఫాస్ట్‌గా తినేశారు. కానీ చివరలో తమ ప్లేట్లలో ఒక చిన్న తోక వంటిది కనిపించింది. పరిశీలించి చూడగా ఆ యువకులంతా షాక్‌ తిన్నారు. చివరకు బల్లి అని గుర్తించారు. విషయం తెలిసిన తర్వాత హోటల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత 8 మంది యువకులకు అక్కడే వాంతులు కూడా అయ్యాయి. అస్వస్థతకు గురయ్యారు.

ఈ సంఘటనతో వెంటనే స్పందించిన స్థానికులు కూడా హోటల్‌ సిబ్బంది వ్యవహారాన్ని తప్పుబట్టారు. అస్వస్థతకు గురైన ఎనిమిది మంది యువకులను వెంటనే అత్తాపూర్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారు. బిర్యానీలో బల్లి వచ్చిన సంఘటనపై రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story