కొండకల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ద్వారా ఎంత మందికి ఉద్యోగాలంటే..

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఇదీ ఒకటి. రూ.1000 వెయ్యి కోట్లతో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2023 12:34 PM GMT
Railway Coach Factory, CM KCR, Medha Group

కొండకల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ద్వారా ఎంత మందికి ఉద్యోగాలంటే..

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ దగ్గర నిర్మించిన మేధా గ్రూప్ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, సబితాఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ కర్మాగారంలో మెషీన్లను పరిశీలించారు.

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఇదీ ఒకటి. రూ.1000 వెయ్యి కోట్లతో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఈ కోచ్‌ ఫ్యాక్టరీ ద్వారా పరోక్షంగా 2,200 మందికి ఉపాధి లభించనున్నది. 150 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో అన్ని రకాల రైల్వే కోచ్‌లు తయారు అవుతాయి. ఏటా 500 కోచ్‌లు, 50 లోకోమోటవ్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉంది. ఇప్పటికే జర్మనీకి చెందిన సీమెన్స్‌ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సీఆర్‌ఆర్‌సీ ఇండియా ఫ్యాక్టరీని స్థాపించి మెట్రో రైళ్లకు రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం కొండకల్‌లో ప్రారంభమైన ఫ్యాక్టరీ దేశంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటైన కోచ్‌ ఫ్యాక్టరీల్లో మూడోదిగా నిలిచింది.

ఈ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చింది. రైల్వే విడి భాగాలు ఎంతో బాగా స్కిల్‌తో చేస్తారు. భారతీయ ఇంజినీర్లతోనే రైల్‌ కోచ్‌లను నిర్మించాలనే లక్ష్యంతో మేధా కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. భారత్‌లో కాకుండా మరో ఐదు దేశాల్లో మేధా సంస్థకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. మేధా గ్రూప్‌ కోచ్‌ల తయారీనే కాదు.. రైల్వేలకు సంబంధించిన సిగ్నలింగ్, ఇతర వ్యవస్థలను కూడా తయారు చేయనుంది.

Next Story