సినిమా థియేటర్లకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

KCR Green signal to Reopen theatres .. గత ఎనిమిదినెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుకుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి

By సుభాష్
Published on : 23 Nov 2020 4:05 PM

సినిమా థియేటర్లకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

గత ఎనిమిదినెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుకుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సోమవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సంబంధించిన టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల సినిమా రంగానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.

కరోనా కారణంగా మూత పడిన సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రీ ఓపెన్‌కు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. అలాగే థియేటర్లలో టికెట్‌ ధరలు సవరించుకునేందుకు కూడా వెలుసుబాటు కల్పించారు. ఢిల్లీ, మహారాష్ట్రలో ఉన్న విధంగా ధరలను సవరించుకోవచ్చని అన్నారు. కాగా, ఆదివారం పలువురు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. సినిమా థియేటర్‌లు ఓపెన్‌ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరాగా, సోమవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు.

Next Story