కరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీపై బదిలీ వేటు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 8:15 PM ISTకరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీపై బదిలీ వేటు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసంతృప్తులు పార్టీలు మారుతున్నారు. కొందరైతే అధిష్టానాలకు షాక్ ఇస్తూ సొంత గూటికి చేరడం చూశాం. మరోవైపు ఎన్నికల సంఘం ఈ సారి పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు, మద్యం తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. అంతకుముందు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది ఎన్నికల సంఘం.
తెలంగాణలో మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్‌కు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేసింది. కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడిపై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.