Karimnagar: ఎల్‌ఎండి జలాశయంలో దూకిన మహిళను రక్షించిన బోటు డ్రైవర్

ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్న చిన్న విషాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  23 Sep 2024 12:17 PM GMT
Karimnagar: ఎల్‌ఎండి జలాశయంలో దూకిన మహిళను రక్షించిన బోటు డ్రైవర్

ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్న చిన్న విషాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు చివరి నిమిషంలో ఎదుటివారు చూడటం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఈటిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. కానీ.. అది గమనించిన బోటు డ్రైవర్‌ చాకచక్యంగా ఆమెను సేవ్ చేశాడు.

కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండిలో సంధ్య అనే వివాహిత టూరిస్ట్ బోటులో టికెట్ కొనుక్కొని ఎక్కింది. ఆ విధంగా బోటులో ఉన్న వారందరూ వాటర్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో బోటు వేగాన్ని పెంచారు. అదే అదునుగా చూసిన సంధ్య బోటు వెనుకకు వెళ్లి నీటిలో అమాంతం దూకేసింది. అది గమనించిన బోటు సిబ్బంది, స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. సేఫ్ జాకెట్ వేసి..సదరూ మహిళా ప్రాణాలను కాపాడారు. అనంతరం బోటు డ్రైవర్, స్థానికులు లేక్ పోలీసులకు సమాచారాన్ని అందించారున మహిళను వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే వివాహిత సంధ్య ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. బోటు డ్రైవర్‌ సదురు మహిళను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story