Viral Video : సిటీ చూద్ధామ‌ని వ‌చ్చిందా..? మియాపూర్ మెట్రో వద్ద చిరుత క‌ల‌కలం..!

హైద‌రాబాద్ న‌గ‌రం మియాపూర్‌లో చిరుతపులిని పోలిన జంతువు ఒక‌టి కనిపించడంతో స్థానికులు, ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.

By Kalasani Durgapraveen  Published on  19 Oct 2024 6:48 AM IST
Viral Video : సిటీ చూద్ధామ‌ని వ‌చ్చిందా..? మియాపూర్ మెట్రో వద్ద చిరుత క‌ల‌కలం..!

హైద‌రాబాద్ న‌గ‌రం మియాపూర్‌లో చిరుతపులిని పోలిన జంతువు ఒక‌టి కనిపించడంతో స్థానికులు, ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వెనుక చిరుతపులి ఆకారంలో ఉన్న జంతువు సంచరిస్తున్న వీడియో శుక్రవారం రాత్రి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని.. అక్క‌డ తిరుగుతున్న‌ది చిరుతపులినా.. కాదా అనే విష‌య‌మై జాడలను గుర్తించి పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీడియో బయటపడిన తర్వాత బృందాలను పంపినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (HAF) రాండోబరియల్ తెలిపారు. వీడియో చూసిన తర్వాత అది అడవి పిల్లి కావ‌చ్చ‌ని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ-పోచింగ్ స్క్వాడ్ ఆ జంతువు జాడ క‌నుగొనే ప్ర‌య‌త్నంలో ఉంది. రేపు పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.


Next Story