రేపు తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆ దిశగా ముందడుగులు వేస్తున్నాయి.

By -  Srikanth Gundamalla
Published on : 27 Jan 2024 9:15 AM IST

home minister amit shah, telangana tour, bjp ,

రేపు తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆ దిశగా ముందడుగులు వేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నాయకత్వం కూడా లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా.. పార్లమెంట్‌ ఎన్నికలకు రెడీ అవుతోంది. కాగా.. 2019 ఎన్నికల్లో నలుగురు ఎంపీలను గెలిచిన బీజేపీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్‌ విసిరింది. ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రేపు తెలంగాణకు రానున్నారు. మూడు జిల్లాల్లో జరిగే కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక విమానంలో బేగంపేటకు రానున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌కు వెళ్తారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే పార్టీ కస్టర్ సమావేశంలో అమిత్‌షా పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత కరీంనగర్‌కు వెళ్తారు అమిత్‌షా. అక్కడ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని.. సికింద్రాబాద్ పార్లమెంట్‌లో పార్టీ నిర్వహించనున్న మేధావుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోపై చర్చించనున్నారు. ఆదివారం రాత్రే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. మోదీ మేనియాతో పాటు పలు కీకల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు బీజేపీ నేతలు. మరోవైపు తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో కీలక నేతలను నిలబెట్టేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఆదివారం నిర్వహించే బీజేపీ కార్యకర్తల సమావేశానికి 20 వేల మంది హాజరవుతారని ఎంపీ బండి సంజయ్ చెప్పారు చెప్పారు.

Next Story