హిమాన్షు కొత్త పాట కోసం ఎదురుచూస్తున్నా: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మరో కొత్త సాంగ్‌తో అలరించబోతున్నాడు.
By Srikanth Gundamalla
హిమాన్షు కొత్త పాట కోసం ఎదురుచూస్తున్నా: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మరో కొత్త సాంగ్‌తో అలరించబోతున్నాడు. ఈ విషయాన్ని హిమాన్షు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొత్త పాటను జూలై 24న విడుదల చేస్తున్నా.. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు హిమాన్షు. తన కొత్త పాటను చూసినవారంత కచ్చితంగా ఆనందపడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే.. తనయుడి ట్వీట్‌ను రీట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. హిమాన్షు పాట కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.
హిమాన్షు మంచి పనులు చేస్తూ ఇలా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నాడు. ఇటీవల ఓ స్కూల్‌ను రీడిజైన్ చేసి పేదలకు అండగా నిలబడ్డాడు. తన సొంత ఖర్చులు, విరాళాల సేకరణతో స్కూల్ రూపురేఖలనే మార్చేశాడు. సామాజిక సేవ చూస్తూనే తనలో ఉన్న టాలెంట్‌ను బయటపెడుతున్నాడు హిమాన్షు. గతంలో కూడా పాట పాడిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ పాడిన ‘గోల్డెన్ అవర్’ సాంగ్‌ను కల్వకుంట్ల హిమాన్షు రావు గతంలో అద్భుతంగా ఆలపించాడు. ఈ ఇంగ్లీష్ సాంగ్ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘం అని నెటిజన్లు కొనియాడారు. జాకబ్ లాసన్‌ను తలపించేలా హిమాన్షు ఈ కవర్ సాంగ్ పాడాడని ప్రశంసించారు. మరోసారి కూడా హిమాన్షు పాట రాబోతుంది. ఈసారి 24వ తేదీన విడుదల కాబోయే పాట కూడా గతంలో మాదిరే మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Looking forward eagerly 😊 https://t.co/hNVHrltBa7
— KTR (@KTRBRS) July 22, 2023