రూ.కోటితో ప్రభుత్వ స్కూల్‌ను రీడెవలప్ చేసిన సీఎం కేసీఆర్ మనవడు

ఓ స్కూల్‌ను హిమాన్షు రూ.కోటితో రీడెవలప్‌ చేశాడు. కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దాడు.

By Srikanth Gundamalla
Published on : 11 July 2023 12:08 PM IST

Himanshu, Minister KTR, School Redevelop,

రూ.కోటితో ప్రభుత్వ స్కూల్‌ను రీడెవలప్ చేసిన సీఎం కేసీఆర్ మనవడు

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అందరికీ తెలిసే ఉంటాడు. సేవా కార్యక్రమాల్లో తాత, తండ్రిలాగే హిమాన్షు ఎప్పుడూ ముందు ఉంటాడు. తాజాగా హిమాన్షు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడ. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఇటీవల మంత్రి కేటీఆర్ తన నానమ్మ సొంత ఊరు కామారెడ్డి జిల్లా కోనాపూర్‌లో ఆమె స్మారకార్థం పాఠశాల భవనం నిర్మించారు. సొంత ఖర్చులతో నిర్మించి సేవా గుణాన్ని చాటుకున్నాడు. అదేబాటలో నడుస్తున్నాడు ఆయన తనయుడు హిమాన్షు. ఓ స్కూల్‌ను రూ.కోటితో రీడెవలప్‌ చేశాడు. కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దాడు.

హైదరాబాద్‌ ఖాజాగూడలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో చదువుతున్న సమయంలో.. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గచ్చిబౌలి కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక స్కూల్‌ను సందర్శించాడు. పాఠశాలలో ఉన్న అవసరాలను గురించి తెలుసుకున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయులతో కూడా మాట్లాడాడు. దీంతో.. పేద విద్యార్థులు చదువుకునే కేశవనగర్‌ స్కూల్‌లో మంచి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఆ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దాడు. ఈ విషయాలను కేశవనగర్ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ రాములు యాదవ్ తెలిపారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్లు నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హిమాన్షు చొరవతో మొత్తం స్కూల్‌ రూపురేఖలు మారి.. ప్రయివేట్‌ స్కూల్‌గా మారిందని చెప్పారు. స్కూల్‌ అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను హిమాన్షు తన ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. అంతకు ముందు ఆ తర్వాత అంటూ ఫోటోలను ట్వీట్‌ చేశారు. హిమాన్షు తీసుకొచ్చిన మార్పుని చూసిన నెటిజన్లు అతన్ని మెచ్చుకుంటున్నారు.

కాగా.. జూలై 12న హిమాన్షు పుట్టిన రోజు. దీంతో.. తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న రీడెవలప్‌ చేసిన కేశవనగర్‌ స్కూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభిస్తారని హిమాన్షు ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.

Next Story