Telangana: రాజ్‌భవన్‌లో భోగి వేడుక.. పాయసం చేసిన గవర్నర్

తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

By Srikanth Gundamalla
Published on : 13 Jan 2024 10:30 AM IST

governor tamilisai, raj bhavan, pongal celebration,

Telangana: రాజ్‌భవన్‌లో భోగి వేడుక.. పాయసం చేసిన గవర్నర్

తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో భోగి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజ్‌ కుండలో పాయసం వండారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తమిళిసై.. దేశ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్‌ అని చెప్పారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అవుతున్నట్లు చెప్పారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను విడుదల చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలనీ, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని గవర్నర్ తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది వికసిత భారత్‌ అని పేర్కొన్నారు. కాగా.. గవర్నర్ తమిళిసై శుక్రవారం పుదుచ్చేరి రాజ్‌నివాస్‌లో కూడా పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక గవర్నర్ తమిళిసై శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం కానున్నాయి. ఇప్పటికే అగ్రనేతలతో భేటీకి సంబంధించి అపాయింట్‌మెంట్‌లు కూడా ఖరారు అయ్యాయి.

Next Story