కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, మంత్రి సీరియస్
నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 12 Sep 2023 8:54 AM GMTకస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, మంత్రి సీరియస్
నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన కాలేజ్ యజమాన్యం వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే.... నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో ఉన్న కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి సమయంలో విద్యార్థినులు భోజనం చేసిన తర్వాత 90 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పితో బాధపడడమే కాకుండా వాంతులు చేసుకున్నారు. దాంతో.. పాఠశాల సిబ్బంది మొత్తం కంగారు పడిపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రత్యేకాధికారి శోభకు సమాచారం అందించారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి కాలేజ్ సిబ్బందిని, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై మంత్రి వేముల ప్రశాంత్ సీరియస్ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మంత్రి తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వేముల తెలిపారు.