తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ నుంచి శనివారం అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఈసీ వెల్లడించింది.
కాగా.. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఒక డీఏ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కౌంటింగ్ సమయం కావడంతో ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈసీ సానకూలంగా స్పందించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఈసీ కొన్ని ప్రశ్నలు కూడా అడిగిందని సమాచారం. ఇప్పుడే డీఏలు ఎందుకు విడుదల చేస్తున్నారీ.. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది. ఈ క్రమంలో గతంలో డీఏల చెల్లింపుపై ఎన్నికల సంఘం ఆరా తీసింది.
కాగా.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదల చేసుందుకు అనుమతి ఇచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.