సిద్దిపేట జిల్లాలో మరో కొత్త మండలం
Dhulimitta New Mandal In siddipeta District .. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధూళిమిట్ట కేంద్రంగా రాష్ట్ర
By సుభాష్ Published on 9 Dec 2020 7:01 AM ISTతెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధూళిమిట్ట కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. హుస్నాబాద్ డివిజన్‌లోని 8 గ్రామాలతో ధూళిమిట్ట మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ధూళిమిట్ట మండలం కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 11న అభ్యంతరాలను స్వీకరించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం...తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇప్పటి వరకు మద్దూరు మండలం కిందున్న ఎనిమిది గ్రామాలు బుధవారం నుంచి ధూళిమిట్ట పరిధిలోకి రానున్నాయి.
ధూళిమిట్ట మండలంలోని గ్రామాలు:
1. ధూళిమిట్ట, 2. లింగాపూర్, 3. జాలపల్లి, 4. తోర్నల, 5. బైరాన్‌పల్లి, 6. బెక్కల్, 7. కొండాపూర్, 8. కూటిగల్.
సిద్దిపేట డివిజన్‌కు రెండు గ్రామాలు బదిలీ
కాగా, సిద్దిపేట జిల్లా హస్నాబాద్ డివిజన్ మద్దూరు మండలంలోని రెండు గ్రామాలను రాష్ట్ర సర్కార్ సిద్దిపేట డివిజన్‌లోని చేర్యాల మండలానికి బదిలీ చేసింది. దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తూ అక్టోబర్ 11న ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే తాజాగా మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మద్దూరు మండలంలోని కమలాయపల్లి, అర్జునట్ల గ్రామాలు బుధవారం నుంచి చేర్యాల మండల పరిధిలోకి రానున్నాయి.