రాజు ఆత్మహత్యపై అబద్ధాలు చెప్పడం లేదు

DGP Mahender Reddy gives clarity on Raju Suicide.చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు ఆపై రైలు పట్టాలపై

By M.S.R  Published on  17 Sep 2021 2:05 PM GMT
రాజు ఆత్మహత్యపై అబద్ధాలు చెప్పడం లేదు

చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు ఆపై రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు తెలిపారు. రాజు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. రాజు మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని, ఇది ఆత్మహత్యేనని క్లారిటీ ఇచ్చారు. రాజు మరణంపై అనుమానాలకు తావులేదని అన్నారు. రాజు రైలు కింద పడ్డాడని చెప్పడానికి కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు లోకో పైలెట్లు ఇద్దరూ ప్రత్యక్షసాక్షులని, వారు కాకుండా ఇద్దరు రైల్వే గ్యాంగ్ మన్లు, ముగ్గురు రైతులు కూడా రాజు ట్రాక్ పై తిరుగుతుండడాన్ని చూశారని డీజీపీ వెల్లడించారు. రాజుది ఆత్మహత్యేనని, ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలు కూడా సేకరించామని తెలిపారు. ఆరోపణలు చేసేవారు ఆధారాలతో ముందుకు రావాలని, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశారు.

రాజు గురించి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు సూచించారు. రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఈ నెంబర్లకు ఏకంగా అయిదువేలకు పైగా కాల్స్ వచ్చాయట..! కొందరు ఈ ఫోన్‌ నంబర్లు నిందితుడివే అనుకొని కాల్ చేసి.. లిఫ్ట్ చేసిన వెంటనే తిట్టడం ప్రారంభించారు. మరికొందరైతే ఏకంగా గంజాయి ఉందా అని అడిగారు. తొలుత ప్రతి కాల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తర్వాత అవతలి వ్యక్తి చెబుతోన్న సమాచారం నమ్మదగినదిగా అనిపిస్తేనే రంగంలోకి దిగారు.

Next Story
Share it