ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 11:21 AM GMT
Case Booked,  MP Revanth Reddy, Nagarkurnool,

 ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు

టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రేవంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని భూత్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌, జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే.. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో పలువురు నాయకుల చేరికల సందర్భంగా రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీసులను ఒక్కొరొక్కరిని గడ్డలు ఊడదీసి కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో జిల్లా పోలీస్‌ అధికారుల అసోసియేషన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పగలు, రేయి అనకా రాత్రంతా పోలీసులు కష్టపడతారని.. ఇలా రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడటం సబబు కాదని అన్నారు.

ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీస్‌ అధికారుల అసోసియేషన్ సభ్యులు భూత్పూర్, జడ్చర్ల పోలీస్‌ స్టేషన్లలో కంప్లైంట్‌ ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై 153, 504, 505 (2), 506 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Next Story