వైరా బీఆర్ఎస్‌లో కలకలం..మాజీ ఎమ్మెల్యే రాసలీలల ట్విస్ట్!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 8:15 AM GMTవైరా బీఆర్ఎస్‌లో కలకలం..మాజీ ఎమ్మెల్యే రాసలీలల ట్విస్ట్!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. పలువురు ఆశావాహులు పార్టీల అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. ఆ క్రమంలో సొంత పార్టీలోనే కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. టికెట్ రాదని కన్ఫామ్‌గా తెలిసిన వారు అవతలివారిపై ఆరోపణలు చేస్తున్నారు. రేపు అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రటకించనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అయితే ఇందులో పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేనట్లుగా సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని వైరా బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ రాసలీలలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉండగా మరోవైపు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములు నాయక్ ఉన్నారు. ఆయనకు ఈసారి టికెట్ రావడం కష్టమని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనకు టికెట్ కావాలంటూ బానోతు మదన్ లాల్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే అధిష్టానం ఆయనను హైదరాబాద్‌కు పిలిచి మాట్లాడిందని.. టికెట్ ఆయనకే వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ ఫోటోలు బయటకు రావడం తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి.
అయితే.. మదన్‌లాల్‌కే టికెట్ వస్తుందని తెలిసి రాములు నాయక్ వర్గం ఇలాంటి దుష్ప్రచారం చేస్తోందని మదన్ లాల్ వర్గం తిప్పికొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోలు మార్ఫింగ్ చేసినవని చెబుతోంది. అవి అసలు నిజమైనవి కావని అంటున్నారు. కానీ ఈ విషయంపై బానోతు మదన్ లాల్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దాంతో.. పలు అనుమానాలు తావిస్తోంది. ఫోటోలు నిజమైనవా? లేదంటే మార్ఫింగ్ చేశారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మదన్ లాల్ కూడా స్పందిస్తారని ఆయన వర్గం నాయకులు చెబుతున్నారు.
కాగా.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ దాదాపుగా ఖరారు అయిందని సమాచారం. 105 మంది అభ్యర్థులతో మొదటి లిస్ట్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. కాగా.. ఇందులో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం దక్కలేదనే సమాచారం అందుతోంది. ఇప్పటికే వారికి బీఆర్ఎస్ అధిష్టానం సమాచారం అందించినట్లు కూడా తెలుస్తోంది. ఆ పది స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైరా స్థానంపై చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు అధిష్టానం టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. దాంతో తనకు టికెట్ ఇవ్వాలని.. బానోతు మదన్‌లాల్ ఆశించారు. అధిష్టానం చుట్టూ తిరిగారు. కానీ.. అనుకోకుండా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన రాసలీల ఫొటోలు వైరల్ అవ్వడంతో సంచలనంగా మారింది. లిస్ట్ ప్రకటించకముందే ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.