యూపీ మదర్సా చట్టంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన అసదుద్దీన్ ఒవైసీ

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టాన్ని సమర్ధించిన సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు

By Kalasani Durgapraveen  Published on  5 Nov 2024 4:15 PM IST
యూపీ మదర్సా చట్టంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన అసదుద్దీన్ ఒవైసీ

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టాన్ని సమర్ధించిన సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. మదర్సాల విద్యను నియంత్రించే ఉత్తరప్రదేశ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. 2004 ఉత్తరప్రదేశ్‌ మదరసా ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ యాక్ట్‌ లౌకికవాద సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం మదర్సా విద్యను నియంత్రిస్తుంది.

మతపరమైన బోధనపై చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా భారతదేశంలో ఎన్నడూ ఆంక్షలు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. యోగి ప్రభుత్వం మదర్సాలను పరువు తీయడానికి, చట్టవిరుద్ధమని ముద్ర వేయడానికి నిరంతరం ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

Next Story