అండగా మేమున్నాం.. రోహిత్ వేముల తల్లికి జాతీయ స్త్రీవాద వేదిక మద్దతు
రోహిత్ వేముల తల్లికి అండగా నిలిచింది జాతీయ స్త్రీవాద వేదిక (ALIFA).
By Srikanth Gundamalla Published on 9 May 2024 2:15 PM ISTఅండగా మేమున్నాం.. రోహిత్ వేముల తల్లికి జాతీయ స్త్రీవాద వేదిక మద్దతు
కొన్నేళ్లుగా హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కొనసాగుతూనే ఉంది. యూనివర్సిటీల్లో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారంటూ 2016 ఏడాది మొదట్లోనే దేశవ్యాప్తంగా ఆందోళనలకు రోహిత్ సూసైడ్ కేసు దారి తీసింది. అయితే.. ఇటీవల ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహిత్ వేముల అసలు దళితుడు కాదనీ.. తన కులం గురించిన విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నాడని తెలంగాణ హైకోర్టులో పోలీసులు క్లోజర్ రిపోర్ట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇక పోలీసుల తీరుతో రోహిత్ వేముల కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే రోహిత్ వేముల తల్లికి అండగా నిలిచింది జాతీయ స్త్రీవాద వేదిక (ALIFA). రోహిత్ వేములకు ఉన్న దళిత గుర్తింపును చెరిపివేయడాన్ని సవాల్ చేస్తూ తల్లి చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్టన్లు చెప్పారు. రోహిత్ తల్లి రాధిక ఆవేదన, బాధను పంచుకుంటానని చెప్పారు. రోహిత్ కు న్యాయరం, స్వాభిమానం డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్నేహితులు చేసిన పోరాటంపై తిరోగమన రిపోర్ట్ బురదజల్లి అణగదొక్కుతుందని జాతీయ స్త్రీవాద వేదిక పేర్కొంది.
రాజ్యాంగ హక్కులు కల్పించినా కూడా దళితులు నిరంతరం వివక్ష, హింసలను ఎదుర్కొంటున్నారని తెలిపింది జాతీయ స్త్రీవాద వేదిక. రోహిత్ గుర్తింపును చెరిపేయడం అంటే అతని జీవితం, అనుభవానాలను నిరకారించడమే అని చెప్పింది. రోహిత్ తల్లి రాధిక చేస్తున్న పోరాటం, ఆమె ధైర్యం, నిబద్ధతను తాము గౌరవిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై న్యాయమైన విచారణ జరిపించాలని అధికారులను కోరుతున్నామనీ.. రోహిత్ గుర్తింపును నిలబెట్టి, గౌరవించాలని డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ స్త్రీవాద వేదిక తెలిపింది. రోహిత్ ‘మరణానికి’ బాధ్యులైన వారిని కోర్టు ముందుకు ఈడ్చి, శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన వాగ్ధానం మేరకు దళిత, ఆదివాసీ, ఓబీసీ, ఇతర మైనార్టీలు, జెండర్ మైనార్టీలకు చెందిన విద్యార్తులు, వివక్ష లేకుండా స్వాభిమానంతో చదువుకోవడానికి రక్షణ కల్పించే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా జాతీయ స్త్రీవాద వేదిక డిమాండ్ చేసింది. ఇక చివరగా రోహిత్ వేముల తల్లి ఒంటరి కాదనీ.. ఆమె వెనుక స్త్రీవాదులుగా తాము నిలబడతామన్నారు. కలిసికట్టుగా అన్యాయాన్ని, అడ్డంకులను అధిగమించాలని జాతీయ స్త్రీవాద వేదిక పిలుపునిచ్చింది.