తెలంగాణలో క్రైమ్ రేటు 8.97 శాతం పెరిగింది: డీజీపీ
తెలంగాణలో నేరాలపై వార్షిక నివేదికను విడుదల చేశారు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా.
By - Srikanth Gundamalla |
తెలంగాణలో క్రైమ్ రేటు 8.97 శాతం పెరిగింది: డీజీపీ
తెలంగాణలో నేరాలపై వార్షిక నివేదికను విడుదల చేశారు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు. పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. అయితే.. గతేడాదితో పోలిస్తే తెలంగాణ వ్యాప్తంగా 8.97 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు.
ఈ ఏడాదిలో మొత్తం 2,12,12 కేసులు నమోదు చేశామన్నారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు కూడా పెరిగాయని చెప్పార. 17.59 శాతం సైబర్ నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా అన్నారు. ఈ ఏడాది జీరో ఎఫ్‌ఐఆర్‌లు 1,108 నమోదు కాగా.. ఐపీసీ కింద 1,38,312 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదు పడ్డాయనీ.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1360 డ్రగ్స్ కేసులు ఎన్‌డీపీఎస్ కింద కేసులు నమోదు అయ్యాయని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. అయితే.. గతేడాదితో పోలిస్తే 2023లో డ్రగ్స్ కేసులు 15.6 శాతం పెరిగాయని చెప్పార.
మహిళలపై 19,013 వేధింపుల కేసులు నమోదు నమోదు కాగా.. ఇందులో 2,284 కేసులు రేప్ కేసులు ఉన్నాయని డీజీపీ రవి గుప్తా చెప్పారు. 33 వరకట్న హత్యలు, 132 వరకట్న మరణాలు, 9,458 వరకట్న వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ఇక 212 మహిళల హత్యలు, 884 మహిళా కిడ్నాప్ కేసులు నమోదయ్యాని డీజీప చెప్పారు. 2,426 పోక్సో కేసులు నమోదు కాగా.. ఒక నిందితుడికి మరణశిక్ష పడిందని చెప్పారు. 104 మందికి జీవిత ఖైదు పడిందని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేశామనీ.. ఇందులో భాగంగా 182 మందిని అరెస్ట్ చేశామన్నారు. రూ.7.99 కోట్ల రూపాయలు సీజ్ చేయగా.. 536 మందికి పునరావాసం కల్పించామన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 20,699 జరిగాయని.. ఇందులో 6,788 మంది చనిపోయారనీ డీజీపీ రవిగుప్తా చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 19,137 మంది గాయపడ్డారని అన్నారు. హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులు 287 నమోదు అయ్యాయనీ.. వీటిల్లో 557 మంది బాధితులను కాపాడామని డీజీపీ చెప్పారు. 364 ట్రాఫికర్స్‌ను అరెస్ట్ చేశామని డీజీపీ రవి గుప్తా చెప్పారు.