2021లో సాధారణ, ఐచ్ఛిక సెలవులు ఇవే
2021 General, Optional Holidays I 2021లో వచ్చే ఏడాదిలో సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 2021లో 28 సాధారణ
By సుభాష్ Published on 11 Nov 2020 10:05 AM GMTవచ్చే ఏడాదిలో సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 2021లో 28 సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవు దినాలు ఉండనున్నాయని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రాష్ట్రలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఆదివారాలతో పాటు అన్ని రెండో శనివారాలు (ఫిబ్రవరి 13) మినహా మూసి ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా 25 ఐచ్ఛిక సెలవుల్లో ఐదుకు మించకుండా వాడుకోవచ్చని సూచించారు.
పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు, విద్యాసంస్థలకు, పబ్లిక్ వర్క్స్ శాఖల ఉద్యోగులకు ఈ సాధారణ సెలవులు వర్తించవని స్పష్టం చేశారు. ఆయా పండగల సందర్భాలలో ఈ సంస్థలకు వర్తించనున్న సెలవులను ప్రకటిస్తూ సంబంధిత శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలాగే రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్‌నబీ వంటి పర్వదినాల్లో ఏవైమా మార్పులు చేసుకుంటే ప్రభుత్వం ఆ సెలవు దినాలను సైతం మార్చనుంది.
1. కొత్త సంవత్సరం 01-01-2021 (శుక్రవారం)
2.భోగి 13-01-2021 (బుధ)
3. సంక్రాంతి 14-01-2021 (గురు)
4. గణతంత్ర దినోత్సవం 26-01-2021 (మంగళ)
5. మహాశివరాత్రి 11-01-2021 (గురు)
6. హోళీ 29-03-2021 (సోమ)
7. గుడ్ ఫ్రైడే 02-04-2021 (శుక్ర)
8. బాబూ జగ్జీవన్‌రాం జయంతి 05-04-2021 (సోమ)
9. ఉగాది 13-04-2021 (మంగళ)
10. బీఆర్ అంబేద్కర్ జయంతి 14-04-2021 (బుధ)
11. శ్రీరామనవమి 21-04-2021 (బుధ)
12. రంజా 14-05-2021 (శుక్ర)
13. రంజాన్ మరుసటి రోజు 15-05-2021 (శని)
14. బక్రీద్ 21-07-2021 (బుధ)
15. బోనాలు 02-08-2021 (సోమ)
16. స్వాతంత్ర్య దినోత్సం 15-08-2021 (ఆది)
17. షహదత్-ఏ-ఇమామే 19-08-2021 (గురు)
18. శ్రీకృష్ణాష్టమి 31-08-2021 (మంగళ)
19. వినాయక చవితి 10-09-2021 (శుక్ర)
20. మహాత్మగాంధీ జయంతి 02-10-2021 (శని)
21. బతుకమ్మ 06-10-2021 (బుధ)
22. విజయదశమి 15-10-2021 (శుక్ర)
23. విజయదశమి మరుసటి రోజు 16-10-2021 (శని)
24. ఈద్‌మిలాద్ ఉన్ నబీ 19-10-2021-(మంగళ)
25. దీపావళి 04-11-2021 (గురు)
26. కార్తీకపూర్ణిమ 19-11-2021 (శుక్ర)
27. క్రిస్మస్ 25-12-2021 (శని)
28. బాక్సింగ్ డే 26-12-2021 (ఆది)
కాగా, జనవరి 1న పబ్లిక్ హాలిడేగా ప్రకటించినందుకు ఫిబ్రవరి 13న రెండో శనివారం పనిదినంగా ప్రకటించింది ప్రభుత్వం.