రామగుండంలో రౌడీలకు క్లాస్‌.. ఎందుకంటే..!

By అంజి
Published on : 25 Nov 2019 6:26 PM IST

రామగుండంలో రౌడీలకు క్లాస్‌.. ఎందుకంటే..!

మంచిర్యాల: నేరాలకు పాల్పడి జైలు నుంచి విడుదలైన నిందితులకు, సస్పెక్ట్ షీట్లు తెరవబడిన అనుమానితులకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. రామగుండం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ ఎన్‌. అశోక్‌ కుమార్‌ నిందితులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు చట్టపరమైన కేసులు ఎన్ని సార్లు నమోదు చేసి జైలుకు పంపిన కూడా మార్పు రావడంలేదని అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ ఎన్‌. అశోక్‌ కుమార్‌ అన్నారు. నిందితులు వారి ప్రవర్తన, ప్రవృత్తి మార్చుకోకుండా అక్రమ చట్ట వ్యతిరేక ,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

Ramagundam1

నిందితుల ప్రవర్తన ,కదలికలపై పూర్తి స్థాయిలో పోలీసుల నిఘా ఉంటుందని డీసీపీ అడ్మిన్‌ ఎన్‌. అశోక్‌ కుమార్‌ అన్నారు. నిందితులు తిరిగి నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెడు ప్రవర్తన కలిగిన వారు అలవాట్లను మార్చుకోవాలని లేని ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని ఎన్‌.అశోక్‌ కుమార్‌ అన్నారు. డీసీపీ లా అండ్‌ ఆర్డర్ రవి కుమార్, సిసిఎస్ ఎసిపి ఉమహేశ్వర్, సిసిఎస్ సిఐలు వెంకటేశ్వర్లు, రమణ బాబు, శ్రీనివాస్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story