ఆదివారం నుంచి పాత సచివాలయానికి తాళం..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 27 Sept 2019 7:30 PM IST

హైదరాబాద్ : పాత సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోవాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ..సచివాలయ భవనాల నుంచి శాఖల తరలింపు వేగవంతం చేశారు. ఇప్పటికే 90 శాతం బ్లాక్‌లు ఖాళీ అయ్యాయి. ఎల్లుండికి సచివాలయం పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశముంది.
సమూహలుగా విడిపోయి పాతసచివాలయం బ్లాక్‌ను సాధారణ పరిపాలన శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. బీఆర్‌కేఆర్ భవనానికి తరలి పోవాలని సిబ్బందికి అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం ఉదయం పాత సచివాలయ భవనానికి సాధారణ పరిపాలన శాఖ అధికారులు తాళం వేయనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర తాళం ఉంటుందని అవసరమనుకున్న వాళ్లు ..సీఎస్ నుంచి తాళం తీసుకోవాలని జీఏడీ అధికారులు చెప్పారు.
Next Story