తెలంగాణలోనే ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు : హై కోర్టు

By రాణి  Published on  3 Feb 2020 1:22 PM GMT
తెలంగాణలోనే ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు : హై కోర్టు

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ర్టంలోనే ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ఢిల్లిలో ఒలింపిక్ ఎన్నికలు జరపాలని జగధీష్ యాదవ్, దానిని ఛాలెంజ్ చేస్తూ..తెలంగాణలోనే ఒలింపిక్ సంఘం నిర్వహించాలని జగన్మోహనరావులు పిటిషన్లు వేశారు. నేడు హై కోర్టు ఇచ్చిన తీర్పుతో జగధీష్ యాదవ్ వర్గానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తెలంగాణ ఒలింపిక్ భవన్, సంఘం కార్యాలయం అన్నీ ఇక్కడే ఉంచుకుని ఎన్నికలు న్యూఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని వాదించారు జగన్మోహనరావు తరపు న్యాయవాది. అలాగే రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పని చేసిన వ్యక్తి మరోసారి ఎలా అదే పదవికి పోటీ చేస్తాడని న్యాయమూర్తి జగదీష్ యాదవ్ ను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తతంగం లోపభూయిష్టంగా, విమర్శలకు తావిచ్చేందుగా‌ ఉందని హైకోర్టు జగదీష్ వర్గానికి అక్షింతలు వేసింది. మంగళవారం అరిసనపల్లి జగన్మోహనరావు ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారి నియామకం, జయేష్ నామినేషన్ పై కూడా రిట్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు.

Next Story
Share it