టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై కేసు.. ఎందుకంటే..!

By అంజి  Published on  28 Nov 2019 5:16 AM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై కేసు.. ఎందుకంటే..!

నిజామాబాద్‌: బోధన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్‌ అమెర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వివాదం విషయంలో ఎమ్మెల్యే షకీర్‌, తన సోదరుడు సోహెల్‌తో పాటు మరికొంత మంది తమపై దాడి చేశారంటూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటూ ఫిర్యాదు చేసిన వారిపై కూడా దొంగతనం చేశారని కృష్ణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లో్కి వెళ్తే మంగళవారం అర్థరాత్రి బైక్‌పై వెళ్తుండగా ఇసుక రవాణా చేస్తున్నందుకు ఎమ్మెల్యే మామూళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణ, తన కొడుకు మధు, మాజీ కౌన్సిలర్‌ తనపై దాడి చేశారని పెగడాపల్లికి చెందిన వేణు అనే వ్యక్తి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడికి దిగిన వారు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే, తన సోదరుడు, గన్‌మెన్‌, పీఏతో మరో ఇద్దరు వచ్చారని తెలిపారు. తనను రక్షించేందుకు వచ్చిన ఫిరోజ్‌, రపై వారిపై దాడి చేశారని బుధవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఎమ్మెల్యే తోపాటు మరో 8 మందిపై 143, 323, 506, 290, 341 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రాకేష్‌ తెలిపారు.

ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. తమ కారులో ఉన్న నగదును వేను అపహరించేందుకు ప్రయత్నం చేశాడని కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అడ్డుకున్న తమపై వేణుతో పాటు, రహీమ్‌, ఫీరోజ్‌లు దాడి చేశారని పోలీసులకు తెలిపారు. తన మెడలోని బంగారం గొలుసును లాక్కెళ్లారని కృష్ణ ఫిర్యాదు చేశాడు. కాగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story
Share it