తెలంగాణలో కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు, 11 మంది మృతి
By సుభాష్ Published on 18 Sep 2020 3:20 AM GMTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,67,046 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1016 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి 1,802 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 1,35,357 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.60 శాతం ఉండగా, అదే దేశంలో 1.61 శాతం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులు 30,673 ఉండగా, హోమ్ క్వారంటైన్‌లో 24,081 మంది ఉన్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు.. జీహెచ్‌ఎంసీలో 314, కరీంనగర్ 114, మేడ్చల్ మల్కాజిగిరి 144, నల్గొండ 131, రంగారెడ్డి 174, సిద్దిపేట 121, వరంగల్ అర్బన్ 108 నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో వందలోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.