తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మరణాలు

By సుభాష్  Published on  6 Jun 2020 4:13 PM GMT
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. తాజాగా కరోనాపై తెలంగాణ ప్రభుత్వం శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 206 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్క రోజు 10 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 152 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసులు 3496కి చేరుకోగా, వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులున్నారు.

ఇక కరోనాతో 1710 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 1663 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారిన 123 మంది మృతి చెందారు.

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య -3496

కొత్తగా పాజిటివ్‌ కేసులు – 206

ఈ రోజు జీహెచ్‌ఎంసీలో కరోనా కేసులు – 152

ఒక్క రోజే కరోనా మరణాలు – 10

ఇప్పటి వరకూ కరోనా మరణాలు – 123

యాక్టీవ్‌ కేసుల సంఖ్య – 1663

ఇప్పటి వరకూ డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య – 1710

కొత్తగా ఎక్కడ ఎన్ని కేసులు..

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ -152

రంగారెడ్డి - 10

మేడ్చల్‌ - 18

నిర్మల్‌ - 5

యాదాద్రి -5

మహబూబ్‌నగర్‌ - 4

మహబూబాబాద్‌ - 1

జగిత్యాల్‌ - 2

వికారాబాద్‌ - 1

నాగల్‌ కర్నూల్‌ -2

గద్వాల్‌ -1

నల్గొండ -1

భద్రాది -1

కరీంనగర్ -1

మంచిర్యాల -1

జనగాం - 1Next Story
Share it