అటామిక్ మినరల్ డైరెక్టరేట్‌కు, నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకానికి అనుమతులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ సందర్భంగా రిజర్వ్ జోన్ లో ఎలాంటి తవ్వకాలు చేపట్టోందని ఆదేశించింది. దీని కారణంగా వన్య ప్రాణుల సంరక్షణ పూర్తిగా దెబ్బతింటుందని ప్రభుత్వం పేర్కొంది.

అనంతరం యురేనియం కోసం బోరు బావుల తవ్వకాన్నికూడా అనుమతించే ప్రసక్తే లేదని రాష్ట్ర అటవీ శాఖ స్పష్టం చేసింది. 2016 డిసెంబర్ నెలలో ఎఎండితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. రిజర్వ్ ఫారెస్ట్ లో 4 వేల బోర్ బావులను తవ్వడం ద్వారా వన్య ప్రాణులకు మనుగడకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.

అయితే ఈ నిర్ణయానికి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో వన్యమృగాల సంరక్షణ చట్టంలోని ఒక క్లాజ్ తెలంగాణ ప్రభుత్వానికి సమయానికి అందివచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ సంఘం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వన్య మృగాలకు, గిరిజనులకు చేటు కలిగించే యురేనియం తవ్వకాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలమంత్రి కె.తారకరామారావు వన్యప్రాణి సంరక్షణ సంఘానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ శాసన సభలో, శాసన మండలిలో తెలంగాణ ప్రభుత్వం ఒక తీర్మానాన్నికూడా ఆమోదించడం విశేషం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.