తెలంగాణ సీఎస్‌ గా సోమేశ్‌ కుమార్‌ నియమాకం అయ్యారు. ఈమేరకు ఆయనను నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్వర్వులు జారీ చేశారు. కొద్దిసేపట్లో సోమేశ్‌ కుమార్‌ తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 డిసెంబర్‌ 31వ తేదీ వరకు ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇరిగేషన్‌శాఖ సలహాదారుగా జోషిని నియమించారు. వాస్తవానికి సోమేశ్‌ కుమార్‌ కంటే సీనియర్‌ అధికారి అజయ్‌ మిశ్రాకు ఈ పదవి దక్కిందని అందరు అనుకున్నారు. చివరకు సోమేశ్‌ నియామకం అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరి ఊహాగానాలను తెరదించుతూ సోమేశ్‌ను నియమించారు. కాగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సహా పలు కీలక పదవులు నిర్వహించడం పట్ల ఆయన మంచి కలిసొచ్చిందనే చెప్పాలి.

సుభాష్

.

Next Story