తెలంగాణలో 1,531 కరోనా కేసులు
By సుభాష్ Published on 30 Oct 2020 4:14 AM GMTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,37,187 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,330 మంది మృతి చెందారు. ఇక నిన్న ఒక్క రోజు కరనా నుంచి 1,048 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,17,401 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,456 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 15,425 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా జిల్లాల వారిగా కేసులు:
ఆదిలాబాద్ - 17, కొత్తగూడెం 96, జీహెచ్‌ఎంసీ - 293, జగిత్ఆయల -61, జనగామ -17, భూపాలపల్లి - 17, గద్వాల - 6, కామారెడ్డి - 39, కరీంనగర్ - 71, ఖమ్మం - 83, కొమురం భీం ఆసిఫాబాద్ -9, మహబూబాబాద్ - 31, మహబూబ్‌నగర్ - 26, మంచిర్యాల - 36, మెదక్ - 22, మేడ్చల్ మల్కాజిగిరి - 120, ములుగు - 18, నాగర్ కర్నూలు - 32, నల్గొండ -74, నారాయణపేట - 3, నిర్మల్ - 17, నిజామాబాద్ - 35, పెద్దపల్లి - 24, రాజన్న సిరిసిల్ల-27, రంగారెడ్డి - 114, సంగారెడ్డి - 28, సిద్దిపేట -47, సూర్యాపేట -26, వికారాబాద్ -10, వనపర్తి - 22, వరంగల్ రూరల్ - 25, వరంగల్ అర్బన్ - 54, యాదాద్రి భువనగిరి -31 చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.