తెలంగాణలో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  22 Oct 2020 3:41 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,27,580 చేరుకోగా, మృతుల సంఖ్య 1292 మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 1,717 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 2,06,105కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,183 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 16,977మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకకు 39,78,869 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Next Story