కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయం బాబురావు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 25 Sept 2019 6:35 PM IST

బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఓ పిచ్చి కుక్క అంటూ.. తులసివనంలో గంజాయిమొక్కలా తయారయ్యాడని ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఎవరూ నమ్మొద్దని అన్నారు. మంచిర్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బాపూరావు.. మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. బీజేపీని ఎలా నిరోధించాలన్నదానిపైనే రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు.
Next Story