తెలంగాణ భవన్‌లో సంబరాలు

By సుభాష్  Published on  25 Jan 2020 5:29 AM GMT
తెలంగాణ భవన్‌లో సంబరాలు

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు స్పీడ్‌ జోరుగా ఉంది. రాష్ట్రంలో దాదాపుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక సంబరాలు జరిపేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు రెడీగా ఉన్నారు. ఇక జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 120 మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది.

తెలంగాణ భవన్‌ వద్ద సందడి

అన్ని మున్సిపాలిటీలో కారు దూసుకుపోవడంతో తెలంగాణ భవన్‌ వద్ద సందడిగా మారింది. ఇక 9 కార్పొరేషన్‌లలో ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది

Next Story
Share it