తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 9:09 AM GMT
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఈ నెల 9న మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సభలో నేడు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం సభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ, ఎస్టిమేట్ కమిటీ ఛైర్మన్ గా సొలిపేట రామలింగా రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ టర్మ్ లో అసెంబ్లీ 10 రోజులు నడిచింది. మొత్తం 58 గంటల 6 నిమిషాలు సభ కొనసాగింది. ఈ దఫా శాసనసభలో 3 బిల్లులతో పాటు ఓక తీర్మానాన్ని ఆమోదించారు.

Next Story
Share it