సోలో బ్రతుకే సో బెటర్..ఎందుకంటే..
By రాణి Published on 8 Feb 2020 2:32 PM ISTసోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు మన టాలీవుడ్, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్. చిత్ర లహరి, ప్రతిరోజూ పండగే సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో..వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ మెగా హీరో. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్ కు మంచు విష్ణు కౌంటరిచ్చాడు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తేజ్ కి జంటగా నభానటేష్ ఈ చిత్రంలో కనిపించనుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలయింది. చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో సోలో బ్రతుకే సో బెటర్..ఎందుకంటే నేను నా జీవితాన్ని అలాగే లీడ్ చేస్తున్నాను అంటూ 4 పాయింట్లను జత చేశాడు.
'' సోలో బ్రతుకే సో బెటర్ ఎందుకంటే
1.ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే నేను పెద్దగా టెన్షన్ పడను.
2.రెస్టారెంట్ కి వెళ్తే నా ఫుడ్ కి మాత్రమే నేను పే చేస్తా ( వాలెట్ కి బొక్క పడే ఛాన్సేలేదు)
3.క్రికెట్ ఆడేటప్పుడు కాల్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు.
4.షూట్, క్రికెట్, జిమ్, హోమ్ అండ్ ఫ్రెండ్స్ - నాకు నచ్చినంత టైమ్ నాకు నచ్చిన వారితో నేను స్పెండ్ చేయొచ్చు'' అని కారణాలు చెప్పుకొచ్చాడు.
అలాగే తాను సింగిల్ ఆర్మీ జీవితాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని, #WhySoloBrathukeSoBetter , #SinglesSwag హ్యాష్ టాగ్స్ తో వారి జీవితాల గురించి మీకు తెలిసిన విషయాలు షేర్ చేయాలని కోరాడు తేజ్.