కోచింగ్ ఇస్తానని చెప్పి..మూడేళ్లుగా ఒక్కొక్కరిపై

By రాణి  Published on  6 March 2020 5:29 AM GMT
కోచింగ్ ఇస్తానని చెప్పి..మూడేళ్లుగా ఒక్కొక్కరిపై

మూడేళ్ల నుంచి మూడు బ్యాచ్ ల విద్యార్థినులను..ఒకరి తర్వాత మరొకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కీచక టీచర్. పేరుకే అతను టీచర్ గానీ..విద్యా బుద్ధులు నేర్పాల్సిన వాడే రాక్షసుడి రూపంలో విద్యార్థినులను లొంగదీసుకున్నాడు. గురుకుల శిక్షణ పేరుతో అభంశుభం తెలియని పిల్లలను తన ఇంటికి పిలిపించుకొని మద్యం మత్తులో రోజుకు ఒకరిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఇన్నాళ్ల నుంచి ఆ దుర్మార్గుడికి భయపడి మౌనంగా ఉన్న బాలికల్లో కొందరు ధైర్యం చేసి జరిగిన ఘటన గురించి తమ తల్లిదండ్రులతో మొరపెట్టుకోవడంతో..ఆ కీచక టీచర్ వికృత చేష్టలు వెలుగుచూశాయి.

వివరాల్లోకి వెళ్తే..ఐదో తరగతి పిల్లలకు గురుకుల కోచింగ్‌ ఇస్తానంటూ నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పెద్దాపురానికి చెందిన శరత్‌ వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఓ గ్రామంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేరాడు. ఉదయం 5-6 గంటల వరకు, సాయంత్రం 6.30-7.30 వరకు అతను విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. ఏదో పాఠాలు చెప్తాడన్నమాటే గానీ..ఎప్పుడూ మత్యం మత్తులోనే జోగేవాడు. ఆ మత్తులోనే రోజుకొక విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు సమాచారం. కాగా..ఈ ఏడాది శరత్ వద్ద 10 మంది విద్యార్థినులు శిక్షణ తీసుకుంటుండగా..రోజుకొకరిపై వికృతంగా ప్రవర్తించడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఇది తెలిసిన గ్రామస్తులు ఆగ్రహంతో పాఠశాల ప్రిన్సిపల్ రామస్వామిని నిలదీయగా..నిందితుడు శరత్ కొల్లాపూర్‌లో ఓపెన్‌ డిగ్రీ పరీక్ష రాసేందుకు వెళ్లినట్లు చెప్పాడు. అతడు ఉన్న చోటికి వెళ్లిన గ్రామస్తులు..శరత్ ను గ్రామానికి తీసుకొచ్చి చెప్పులతో దేహశుద్ధి చేశారు.

Next Story
Share it