సినిమా షూటింగ్ లో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 7:38 AM GMT
సినిమా షూటింగ్ లో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..!

  • టీచర్‌ పాత్రలో ఒదిగిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి
  • అమృత భూమి సినిమాలో నటించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
  • ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సినిమా చిత్రీకరణ
  • అధికారి పాత్రలో కలెక్టర్‌
  • గొరడలో షూటింగ్ సందడి

విజయనగరం : ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలిపేలా ‘అమృత భూమి’ సినిమా తెరకెక్కిస్తున్నారు . దీనిలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి టీచర్ గా నటిస్తున్నారు. అధికారి పాత్రలో కలెక్టర్ హరి జవహర్‌లాల్ నటించారు. గొరడ గ్రామంలో జరిగిన షూటింగ్‌లో పుష్ప శ్రీవాణి పాల్గొన్నారు . గొరడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలిగా డిప్యూటీ సీఎంపై సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనంద దాయకమన్నారు. నటుడు రాజాప్రసాద్‌ బాబు మాట్లాడుతూ ..రోజురోజుకీ అటవీ ప్రాంతం అంతరించి పోతోందని, తినే తిండి గింజల నుంచి కట్టుకునే బట్ట వరకు అంతా రసాయనాలతో నిండిపోతుందని వాపోయారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యం పెంచేందుకు ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు చెప్పారు. సినీ రచయిత వంగపండు ప్రసాదరావు ప్రకృతి వ్యవసాయం ఇతివృత్తంగా ఈ కథను రచించారు.

Next Story
Share it