అర్థరాత్రి దారుణ హత్య

By రాణి  Published on  10 Feb 2020 6:14 AM GMT
అర్థరాత్రి దారుణ హత్య

అర్థరాత్రి భార్య ఎదుటే ముగ్గురు దుండగులు ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో చోటు చేసుకుంది. లచ్చిగూడెం నాగన్నగుంపుకు చెందిన ఉపాధ్యాయుడు చిన్న రామకృష్ణ (35)భార్య, పిల్లలతో కలిసి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో..గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అతని గొంతుకోసి పరారయ్యారు. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. రామకృష్ణ స్థానిక ఎంఈఓ కార్యాలయంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్సీ) గా పనిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భూ తగాదాల కారణంతోనే రామకృష్ణను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it