కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

By Medi Samrat  Published on  11 Oct 2019 12:19 PM IST
కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు హౌజ్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌కు పోలీసుల రంగం సిద్ధం చేశారు. మచిలీపట్నంలో ఎమ్మెల్సీ, టీడీపీ నేత బచ్చుల అర్జునుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలను దీక్షకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చాలంటూ కొనేరు సెంటర్‌లో శుక్రవారం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. కొల్లు రవీంద్ర ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Next Story