ఇది రద్దు ప్రభుత్వమే కాని.. ఎప్పటికీ రైతు ప్రభుత్వం కాదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 11:55 AM GMT
ఇది రద్దు ప్రభుత్వమే కాని.. ఎప్పటికీ రైతు ప్రభుత్వం కాదు

పాలకొల్లు : రైతు రుణమాఫీ రద్దుకు నిరసనగా టీడీపీ ఆధ్వ‌ర్యంలో 99 జీవోపై పేడ రాసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే నిమ్మ‌ల రామాయాయుడు పాల్గొన్నాడు. ఈ సంధ‌ర్భంగా మాట్లాడుతూ.. రైతు రుణమాఫీని తప్పు పడుతున్నారు.. వాలంటరీ ల పేరు చెప్పి వైసీపీ కార్యకర్తల కడుపు నింపుతున్నారని ఫైర్ అయ్యారు.

రైతు రుణమాఫీతో ర‌ద్దుతో 33లక్షల రైతుల కడుపు కొట్టారని.. వాలంటరీల వ్యవస్థలో 3 లక్షల మంది వైఎస్ఆర్ కార్యకర్తల కడుపు నింపుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. రైతు రుణమాఫీ 4, 5 వాయిదాల రద్దుతో.. ఒక్కొక్క రైతుకు 40 వేల రూపాయలు రద్దు చేయడం రైతుకు ద్రోహం కాదా..? అని ప్ర‌శ్నించారు.

జగన్ ప్రభుత్వంలో రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోయారని.. అందుకే వంద రోజులలో 140 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమ‌ర్శించారు. జగన్ ప్రభుత్వంలో రైతుకు భరోసా లేదు.. భద్రత లేదు.. అంతా మోసపూరిత పాలన అని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ రద్దుచేస్తూ 99 జీవోను విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని.. ఇది రద్దు ప్రభుత్వమే కానీ ఎప్పటికీ రైతు ప్రభుత్వం కాదు నిమ్మల వ్యాఖ్యానించారు.

Next Story
Share it