రాజధానిలో టీడీపీ నేతల పర్యటన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2019 10:20 AM ISTఅమరావతి: ఇవాళ రాజధాని అమరావతిలో ప్రధాన ప్రతిపక్ష నేతలు పర్యటించనున్నారు.
రాయపూడి నుంచి టీడీపీ నేతల పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు.
రాజధానిలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేతలు రాజధాని పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలు, మాజీ మంత్రులు పాల్గొననున్నారు.
రాజధానిలో చేపట్టిన నిర్మాణాలను టీడీపీ నేతలు పరిశీలించనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణాలను టీడీపీ నేతలు ప్రజలకు చూపించనున్నారు.
Next Story